స్టేషన్ ఘన్‌పూర్‌లో ట్విస్ట్ .. నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ నవ్య , అభ్యర్ధుల్లో టెన్షన్

By Siva Kodati  |  First Published Nov 10, 2023, 9:39 PM IST

సర్పంచ్ నవ్య సైతం స్టేషన్ ఘన్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ, సీనియర్ నేత కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. అలాంటి పరిస్ధితుల్లో సర్పంచ్ నవ్య ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది


కొద్దిరోజుల క్రితం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్యల మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. తనను రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడని.. కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ నవ్య ఆరోపణలు గుప్పించారు. తనపై వ్యామోహంతోనే సర్పంచ్ టికెట్ ఇప్పించానని రాజయ్య అంటున్నాడని.. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో రాజయ్య స్వయంగా నవ్య ఇంటికి వెళ్లి రాజీ కుదుర్చుకోవడం, గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. 

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు అభ్యర్ధులను ప్రకటించగా.. టికెట్ దక్కని ఆశావహులు కొన్ని చోట్ల రెబల్స్‌గా , స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో సర్పంచ్ నవ్య సైతం స్టేషన్ ఘన్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ, సీనియర్ నేత కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. అలాంటి పరిస్ధితుల్లో సర్పంచ్ నవ్య ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఎవరి ఓటు చీల్చుతుందోనని ప్రధాన అభ్యర్ధుల్లో టెన్షన్ నెలకొంది. 

Latest Videos

undefined

Also Read: ఎమ్మెల్యే రాజయ్య నుండి ప్రాణహాని... పోలీస్ ప్రొటెక్షన్ కావాలి : సర్పంచ్ నవ్య సంచలనం

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నవ్య మాట్లాడుతూ.. తాను ఓ వార్డు మెంబర్‌గా, తర్వాత సర్పంచ్‌గా గెలిచానని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశానన్న ఆమె.. తనకు ఎవరి మీదా పగ , కోపం లేవన్నారు. రాజకీయంగా ఎదగడంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలతోనే నామినేషన్ వేశానని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని.. నియోజకవర్గ ప్రజలు తనను ఓ అక్కలా, చెల్లిలా , తమ కుటుంబంలో ఓ వ్యక్తిగా ఆశీర్వదిస్తారని నవ్య ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేస్తానని.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటానని , తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తానని ఆమె స్పష్టం చేశారు. 

click me!