తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు నాలుగు రోజులు, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఆరు రోజుల సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. రెండో శనివారం, దానికి ముందు ఆప్షనల్ హాలిడే కలిసి రావడంతో స్కూల్ విద్యార్థులకు ఈ సారి ఆరు రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి.
Sankranti Holidays: విద్యార్థులకు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సందర్భంగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. స్కూళ్లకు మాత్రం ఆప్షనల్ హాలీడే కూడా కలిసి వస్తుండటంతో ఆరు రోజులు సెలవులు ఉన్నాయి.
ఇంటర్ కాలేజీల కోసం ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. సెలవులు ముగియగానే జనవరి 17వ తేదీన కాలేజీ పున:ప్రారంభం అవుతుంది. సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని కాలేజీలను ఆదేశించింది.
Also Read : Rythu Bandhu : 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు, మళ్లీ మంత్రి సమీక్ష ఎప్పుడంటే ?
ఇక స్కూళ్లకు సంక్రాంతి సెలవుల విషయానికి వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. మిషనరీ స్కూళ్లకు ఈ సెలవుల నుంచి మినహాయింపు ఉన్నది. జనవరి 14వ తేదీన భోగీ, 15వ తేదీన సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగ ఉన్నది. ఈ మూడు రోజులు సెలవులే. అయితే, భోగి కంటే ముందు రోజు.. రెండో శనివారం అవుతున్నది. దీనికి తోడు 12 వ తేదీ ఆప్షనల్ హాలిడే. వెరసి మొత్తంగా రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి కోసం ఆరు రోజుల సెలవులు కలిసి వస్తున్నాయి.