హరీష్‌ను కేసీఆర్ ఆ పని చేయనిచ్చేవారు కాదు...అందుకే...: జగ్గారెడ్డి

By Arun Kumar PFirst Published Feb 13, 2019, 3:25 PM IST
Highlights

గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిన హరీష్ రావు సంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా తెలియకుండా జాగ్రత్తపడుతూ సింగూరు జలాలను అక్రమంగా తరలించుకుపోయాడని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఈ జల దోపిడి గురించి తెలిస్తే అడ్డుకునేవాడు కాబట్టే హరీష్ తెలియకుండా జాగ్రత్తపడ్డాడని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 
 
నీటి కేటాయింపులు లేకున్నా అక్రమంగా రాత్రికి రాత్రి మంజీరా నీటిని శ్రీరాంసాగర్ కు తరలించడంలో హరీష్ కీలకంగా వ్యవహరించారని అన్నారు. దీంతో ప్రస్తుతం మంజీరా నది ఎండిపోయి ఎడారిలా మారిందని ఆవేధన వ్యక్తం చేశారు. ఇలా సంగారెడ్డి ప్రజల గొంతును హరీష్ ఎండబెట్టారని జగ్గారెడ్డి విమర్శించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు కావడం వల్లే ఈ జలదోపిడిని అధికారులు కూడా అడ్డుకోలేకపోయారని జగ్గారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఓవైపు కేసీఆర్ ప్రజలకు తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తుండగా...మరోవైపు హరీష్ తాగునీటిని దోచుకుపోయాడన్నారు. హరీష్ చేసిన ఈ పనులు కేసీఆర్ ను కూడా ఇబ్బందిపెట్టాయని పేర్కొన్నారు. రాజకీయంగా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూసిన హరీష్...తాను గెలిస్తే ఈ విషయాలపై ఎక్కడ మాట్లాడతానోనని భయపడి ఓడించడానికి శాయశక్తుల ప్రయత్నించాడని అన్నారు. దాంట్లో భాగంగానే ఎన్నికలకు ముందు జైల్లో పెట్టించి ఇబ్బంది పెట్టాడని జగ్గారెడ్డి ఆరోపించారు. 

 హరీశ్‌రావు  తాను చేసిన తప్పుకు సంగారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే ఓ మంత్రి తప్పిదం వల్ల తీవ్రంగా నష్టపోయిన సంగారెడ్డికి తక్షణ నీటి అవసరాల కోసం రూ.10 కోట్లు కేటాయించాలని జగ్గారెడ్డి కోరారు.

click me!