జగన్‌తో కేసీఆర్ భేటీ వాయిదా: కారణమిదే....

By narsimha lodeFirst Published Feb 13, 2019, 12:29 PM IST
Highlights

ఈ నెల 14వ తేదీన విశాఖ శారదా పీఠంలో జరిగే  కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదని సమాచారం. 


హైదరాబాద్: ఈ నెల 14వ తేదీన విశాఖ శారదా పీఠంలో జరిగే  కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదని సమాచారం. అదే రోజున వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అమరావతిలో నూతన గృహా ప్రవేశ కార్యక్రమం వాయిదా పడినందున ఈ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా  ఉంటున్నారని తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌ను  శారదా పీఠం వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆహ్వానించారు. 

వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ అమరావతిలో నూతనంగా నిర్మిస్తున్న గృహా ప్రవేశం వాయిదా పడింది. ఈ నెల 14వ తేదీన జగన్ నూతన గృహా ప్రవేశం చేయాలని భావించారు.  అయితే  జగన్ సోదరి షర్మిల, బావ  అనిల్ అనారోగ్యం కారణంగా ఈ గృహ ప్రవేశాన్ని వాయిదా వేశారు. అయితే  అదే రోజున విశాఖ శారదా పీఠంలో జరిగే కార్యక్రమానికి కూడ జగన్ హాజరుకావాల్సి ఉంది. 

విశాఖలో జరిగే కార్యక్రమానికి కేసీఆర్  హాజరౌతారని భావించారు. అదే కార్యక్రమానికి జగన్ కూడ హాజరైతే వీరిద్దరూ సమావేశానికి విశాఖ వేదికగా  మారే అవకాశం కూడ లేకపోలేదనే చర్చ కూడ సాగింది. అయితే వైఎస్ జగన్ నూతన గృహా ప్రవేశం కార్యక్రమానికి కేసీఆర్ కూడ హాజరౌతారా అనే చర్చ కూడ సాగింది.ఈ విషయమై స్పష్టత రాలేదు. 

ఇదిలా ఉంటే  షర్మిల, అనిల్ కుమార్  అనారోగ్యం కారణంగా నూతన గృహా ప్రవేశ కార్యక్రమాన్ని జగన్ వాయిదా వేసుకొన్నారు. ఈ నెల 14వ తేదీన కేసీఆర్ ఏపీ పర్యటన అనుమానంగానే ఉందని  టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

సీఎం కేసీఆర్‌ 14న ఏపీలో విశాఖ పర్యటనకు వెళ్లడంలేదని తెలుస్తోంది.శారదా పీఠాధిపతి  స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతో  కేసీఆర్ రెండు దఫాలు తన ఫామ్‌హౌజ్‌లో పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ విశాఖలోని శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటులో భాగంగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తో కేసీఆర్ ఆదేశం మేరకు కేటీఆర్, ఎంపీ వినోద్ బృందం ఇప్పటికే చర్చలు చేసింది. ఏపీలో జగన్‌తో కేసీఆర్ భేటీ కావాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 14న కేసీఆర్ విశాఖ టూర్‌లో  జగన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని భావించారు.కానీ విశాఖ టూర్‌కు కేసీఆర్ వెళ్లడం లేదని తెలుస్తోంది.


 

click me!