సొంత పార్టీపైనే సంచలన ఆరోపణలు చేసిన జగ్గారెడ్డి

Published : Jan 18, 2019, 02:32 PM IST
సొంత పార్టీపైనే సంచలన ఆరోపణలు చేసిన జగ్గారెడ్డి

సారాంశం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి సొంతపార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో స్థానికంగా బలమున్న నాయకులకు కాకుండా డిల్లీలో బలమున్న నాయకులకే గుర్తింపు వుంటుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ఇప్పటికే బలహీనపడ్డ తెలంగాణ కాంగ్రెస్‌....లాబీయింగ్ ద్వారానే సీఎల్పీ ఎన్నిక జరిగితే మరింత నష్టపోవడం ఖాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.   

రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు స్థానిక నాయకులకు తెలుస్తాయి కానీ డిల్లీ నాయకులకెలా తెలుస్తాయని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కానీ నిర్ణయాలు మాత్రం డిల్లీ స్థాయిలో
జరుగుతాయని...అందువల్ల లాబీయింగ్ చేసే నాయకులు మాటలే అదినాయకత్వం దృష్టికి వెళతాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగే పరిణామాలేవీ రాహుల్ కు తెలియవని జగ్గారెడ్డి వెల్లడించారు.

ఇకనైనా కాంగ్రెస్ పార్టీ డిల్లీలో జరిగే లాబీయింగ్ రాజకీయయాలకు స్వస్తి పలికి...స్థానిక పరిస్థితులను అనుసరించి నిర్ణయాలు తీసపుకోవాలని సూచించారు. అలా చేస్తేనే పార్టీ కోసం పనిచేసే నాయకులకు అవకాశాలు, గుర్తింపు లభిస్తాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసుల కారణంగానే అతడు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. ఇలా నాయకుల బలహీనతలను గుర్తించి టీఆర్ఎస్ పార్టీ వారిని ఆకర్షిస్తోందిని జగ్గారెడ్డి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్