విషాదం: కూతుర్ని డ్రాప్ చేయడానికి వెళ్లి అనంత లోకాలకు... (వీడియో)

Published : Jan 18, 2019, 12:37 PM ISTUpdated : Jan 18, 2019, 12:45 PM IST
విషాదం: కూతుర్ని డ్రాప్ చేయడానికి వెళ్లి అనంత లోకాలకు... (వీడియో)

సారాంశం

మృతుడు రాణా ప్రవీర్ హైదరాబాదులోని కోఠికి చెందినవారు. వృత్తిరీత్యా న్యాయవాది.  ప్రవీర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కూతురు చేయి ఫ్రాక్చర్ అయింది. 

హైదరాబాద్: హైదరాబాదులోని నారాయణగుడాలో శుక్రవారం ఉదయం విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురిని కళాశాల వద్ద దింపడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఓ తండ్రి మృత్యువాత పడ్డారు.

నారాయణగూడ శాంతి థియేటర్ సమీపంలో కూతురు ని బైక్ పై కేశవ మెమోరియల్ కళాశాల వద్ద డ్రాప్ చేయడానికి వెళ్లే సమయంలో ప్రమాదం సంభవించింది. ఆయన నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

మృతుడు రాణా ప్రవీర్ హైదరాబాదులోని కోఠికి చెందినవారు. వృత్తిరీత్యా న్యాయవాది.  ప్రవీర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కూతురు చేయి ఫ్రాక్చర్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయన కూతురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రవీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

                             "

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ