తెరపైకి సమైక్యవాదం .. రెండు రాష్ట్రాలను కలుపుతానంటే కేసీఆర్‌కు మద్ధతిస్తా: జగ్గారెడ్డి సంచలనం

By Siva KodatiFirst Published Oct 30, 2021, 6:23 PM IST
Highlights

కాంగ్రెస్‌ (congress) సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే (sangareddy mla) జగ్గారెడ్డి (jaggareddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో (united andhra pradesh) ముందుకొస్తే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్‌ (congress) సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే (sangareddy mla) జగ్గారెడ్డి (jaggareddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో (united andhra pradesh) ముందుకొస్తే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలోనూ తాను సమైక్య వాదాన్నే వినిపించానని ఆయన గుర్తుచేశారు. అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచానని.. సమైక్యం తన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీకి సంబంధం లేదని జగ్గారెడ్డి వెల్లడించారు. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్య వాదాన్ని తెరపైకి తెచ్చారని ఆయన తెలిపారు. ఈ అంశంలో టీపీసీసీ (tpcc chief) అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి (revanth reddy) అభిప్రాయం వేరు, తన వ్యక్తిగత అభిప్రాయం వేరని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆలోచన మేరకే ముందుకెళ్తానని.. ఏ ప్రాంతానికీ తాను వ్యతిరేకం కాదని ఆయన వెల్లడించారు. ఇది ప్రజల డిమాండ్‌ కాదని, నాయకుల అభిప్రాయం మాత్రమేనని జగ్గారెడ్డి తెలిపారు. 

ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడారని.. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని.. కానీ, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేని జగ్గారెడ్డి ఆవేదన  వ్యక్తం చేశారు. గతంలో తాను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని.. విభజన జరిగినా.. ఆంధ్రా ప్రజలు కోటిమందికి పైగా తెలంగాణలో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఆరోజు నన్ను తప్పుబట్టిన వారు .. ఇప్పుడు సమైక్యానికి మద్దతు పలుకుతున్నారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని..  పార్టీ పెట్టడం ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేద్దాం అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారని ఆయన గుర్తుచేశారు.  సమైక్యం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.  

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీఆర్ఎస్ ను ఏర్పాటు చేయాలని Trs ప్లీనరీ సమావేశంలో Kcr వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దళితబంధును అమలు చేసిన తర్వాత ఈ వినతులు మరింత ఎక్కువయ్యాయని కేసీఆర్ చెప్పారు.ఈ వ్యాఖ్యలపైనే సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.ఈ సమావేశంలో  తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం అంధకారమౌతోందని సమైఖ్య పాలకులు భయపెట్టారన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు లేవన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కరెంట్ కష్టాలున్నాయన్నారు. 

ALso Read:కేసీఆర్ వ్యాఖ్యలకే స్పందించా, కొత్త పార్టీ ఎందుకు: రేవంత్ రెడ్డికి పేర్ని నాని కౌంటర్

కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్నినాని చురకలు అంటించారు. గురువారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని (perni nani) మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నామన్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు..? రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలేదా..? అంటూ నాని సెటైర్లు వేశారు. ఏపీలో పార్టీ పెట్టడానికి ముందుగా.. తెలంగాణ కెబినెట్లో (telangana cabinet) రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్నిపెడితే కేసీఆర్ పెడితే బాగుంటుందని  మంత్రి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చని.. ఏపీ, తెలంగాణలు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ (ys jagan) గతంలోనే కోరుకున్నారని పేర్ని నాని గుర్తుచేశారు. 

ఇక ఇదే అంశంపై బుధవారం స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి. ఏపీలో  Trs పార్టీని ఏర్పాటు పెడతానంటే ఎవరైనా వద్దన్నారా అని  ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పెట్టొద్దని ఎవరూ కూడా అడ్డు చెప్పలేదని సజ్జల గుర్తు చేశారు. రాజకీయ పార్టీని ఎవరైనా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. దీనికి ఎవరి అనుమతులు కూడా అవసరం లేదన్నారు. పార్టీ ఏర్పాటే కాదు ఎక్కడైనా కూడ ఎవరైనా పోటీ చేయవచ్చని Sajjala Ramakrishna Reddy తెలిపారు.

click me!