సంగారెడ్డి పాప మిస్సింగ్... ఎమ్మెల్యే జగ్గారెడ్డి బంపర్ ఆఫర్

Published : May 09, 2019, 12:17 PM IST
సంగారెడ్డి పాప మిస్సింగ్... ఎమ్మెల్యే జగ్గారెడ్డి బంపర్ ఆఫర్

సారాంశం

మూడు రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ పసికందు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. మూడు రోజులౌతున్నా పాప ఆచూకీ మాత్రం లభించలేదు.  

మూడు రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ పసికందు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. మూడు రోజులౌతున్నా పాప ఆచూకీ మాత్రం లభించలేదు.  సీసీటీవీ ఫుటేజీ ఉన్నా కూడా.. పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు.  కాగా.. గురువారం పాప తల్లిదండ్రులను ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. పాప దొరకాలన్నదే తమ ప్రథమ ప్రాధాన్యత అని.. తప్పొప్పుల లెక్కింపు తర్వాత అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. జిల్లా ఆసుపత్రిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరనున్నట్టు తెలిపారు. పాపను అప్పగించిన వారికి రూ.2లక్షల నగదు ఇస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే