టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

By narsimha lodeFirst Published May 9, 2019, 12:07 PM IST
Highlights

అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో  పోలీసులు గురువారం నాడు సోదాలు నిర్వహించారు.
 

హైదరాబాద్: అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో  పోలీసులు గురువారం నాడు సోదాలు నిర్వహించారు.

అలంద సంస్థ మీడియా నిధులను దారి మళ్లించారని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఈ సంస్థ యాజమాని  తన సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని కూడ ఫిర్యాదు చేశారుఈ ఫిర్యాదుల ఆధారంగా రవి ప్రకాష్ కార్యాలయంలో, ఇంట్లో  పోలీసులు సోదాలు నిర్వహించారు.ఈ విషయమై ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

రవిప్రకాష్‌పై ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారని సమాచారం.ఆలంద మీడియా ఎంటర్ టై్న్‌మెంట్‌లో ప్రేమ్ కుమార్ పాండే, జూపల్లి రామేశ్వర్ రావు, అరుణ్ ప్రణీత్ మునగాల, పుల్లూరి కౌశిక్ రావులు డైరెక్టర్లుగా ఉన్నారని తెలుస్తోంది. ఐపీసీ 90,.160 సెక్షన్ల క్రితం పోలీసులు  నోటీసులు జారీ చేశారు. ఈ సోదాలు జరుగుతున్న సమయంలో ఇంట్లో, కార్యాలయంలో కూడ రవిప్రకాష్ లేడు. టీవీ 9 కార్యాలయంలో  కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్క్‌లు మాయమైనట్టుగా పోలీసులు గుర్తించారని తెలిసింది.అయితే ఈ విషయమై పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.

అలంద మీడియా సంస్థ కార్యదర్శిగా ఉన్న కౌశికర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి అడ్డు తగులుతున్నాడని కౌశికర్ రావు ఆరోపిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఏబీసీఎల్ కార్పోరేషన్ నుండి టీవీ 9 సంస్థను అలంద మీడియా సంస్థ టేకోవర్ చేసింది.

సంబంధిత వార్తలు

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

 


 

click me!