హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించారు . ఎన్నికల సంఘం ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు . ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్‌కు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించారు. ఆయనను సీపీగా నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈసీ ఆమోదముద్ర అనంతరం సీఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత సందీప్ రేపు బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే శాండిల్య .. నగర సీపీగా బాధ్యతు స్వీకరించడం విశేషం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్‌కు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కాగా.. మూడు రోజుల క్రితం తెలంగాణలోని పలువురు సీపీలు, కలెక్టర్లు, ఎస్పీలను విధుల నుండి ఈసీ తప్పించింది. విధుల నుండి తప్పించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకం కోసం అధికారుల జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల జాబితాను నిన్న సీఎస్ శాంతికుమారి పంపారు. ఇవాళ మధ్యాహ్నానికి బదిలీ అయిన అధికారుల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా సందీప్ శాండిల్యను హైద్రాబాద్ సీపీగా నియమించింది.
undefined
ALso Read: ఈసీ ఆదేశాలు: హైద్రాబాద్ సీపీగా సందీప్ శాండిల్య నియామకం
1993 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తొలి నాళ్లలో సందీప్ శాండిల్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని కృష్ణా తదితర జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలిస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య ఉన్నారు.