జగిత్యాలలో పోలీసులపై ఇసుక మాఫియా దాడి: ఎస్ఐ సహా నలుగురికి గాయాలు

Published : Jul 27, 2021, 09:45 AM IST
జగిత్యాలలో పోలీసులపై ఇసుక మాఫియా దాడి: ఎస్ఐ సహా నలుగురికి గాయాలు

సారాంశం

జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియా పోలీసులపై దాడికి దిగింది. ఈ దాడిలో ఎస్ఐ సహా ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.   

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియా పోలీసులపై దాడికి దిగింది. ఈ ఘటనలో మల్లాపూర్ ట్రైనీ ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులపై దాడికి దిగిన ఇసుక మాఫియా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అక్రమార్కులు నిబంధనలకు విరుద్దంగా జేసీబీల సహాయంతో ఇసుకను రాత్రిపూట తరలిస్తున్నారనే విషయమై తెలుసుకొన్న ఎస్ఐ  ముగ్గురు కానిస్టేబుళ్లు ఇసుక తరలిస్తున్న ప్రాంతానికి చేరుకొన్నారు. అయితే పోలీసులను గుర్తించిన ఇసక మాఫియా దాడికి దిగింది.,

పోలీసులపై దాడికి దిగిన ఇసుక మాఫియా అక్కడి నుండి పారిపోయారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ గౌస్ బాబా సందర్శించారు. గాయపడిన ఎస్ఐ , ముగ్గురు కానిస్టేబుళ్లను ఆసుపత్రి తరలించారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?