మూణ్ణెళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. నెల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. ఆ భర్త చేసిన పని...

Published : Jul 27, 2021, 09:36 AM IST
మూణ్ణెళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. నెల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. ఆ భర్త చేసిన పని...

సారాంశం

దంపతుల మధ్య నెలకొన్న గొడవలతో నెల రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి అత్తారింటికి రమ్మన్నా ఆమె రావడం లేదు. దీంతో తన భార్య మళ్లీ కాపురానికి వస్తుందో లేదో అని సురేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 

నిజామాబాద్ : మండలంలోని పొల్కంపేట గ్రామంలో ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దాసరి సురేష్ (24) మూణ్నెళ్ల క్రితం బొల్లారం తండాకు చెందిన దేవసోత్ శిరీషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

దంపతుల మధ్య నెలకొన్న గొడవలతో నెల రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి అత్తారింటికి రమ్మన్నా ఆమె రావడం లేదు. దీంతో తన భార్య మళ్లీ కాపురానికి వస్తుందో లేదో అని సురేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం జీవితం మీద విరక్తి చెంది అతడు బైటకు వెళ్లాడు.

తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకి లభించలేదు. సోమవారం పెద్దవాగులోని చెక్ డ్యామ్ వద్ద సురేష్ మృతదేహం లభించింది. తల్లి దేవేంద్ర, తండ్రి భూమయ్య ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇప్పుడు పార్టీ పేరు మార్చ‌మ‌ని అంటే ఎలా.? ఎన్నికల సంఘానికి కవిత లేఖ
జులై 13న మీ పిల్ల‌ల‌కు ఈ ట్యాబ్లెట్స్ క‌చ్చితంగా వేయించండి.. ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇస్తోంది