దిశ కేసు: హైకోర్టుకు వెళ్లేందుకు పిటిషనర్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Dec 18, 2019, 12:57 PM IST
Highlights

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో మృతదేహాల భద్రపర్చడం తదితర విషయాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. 


హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించే అంశంపై హైకోర్టుకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మృతదేహాలు పాడుకాకముందే రీ పోస్టుమార్టం  నిర్వహించి పోరెన్సిక్ ఆధారాలు సేకరించాలని సామాజిక కార్యకర్తలు కె. సజయ, నేషనల్ ఆలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకురాలు మీరా సంఘమిత్ర, మహిళా హక్కుల కార్యకర్త ఎం. విమల, ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య మంగళవారం  నాడు పిటిషన్ దాఖలు చేశారు.

Also read:బిగ్ బ్రేకింగ్: దిశ నిందితుల కేసులో బయటకొస్తున్న సంచలన విషయాలు

ఈ పిటిషన్‌పై   మంగళవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్‌.గవై, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

 ఆధారాల సేకరణ అంశాన్ని హైకోర్టు పర్యవేక్షిస్తోందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డె తెలిపారు. దీంతో తాము హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. అయితే హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు పిటిషనర్లకు అనుమతిస్తున్నట్టుగా పేర్కొంది.

గత నెల 27వ తేదీన దిశపై  శంషాబాద్‌కు సమీపంలోని తొండుపల్లి సర్వీస్ రోడ్డుపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి  హత్య చేశారు.ఈ కేసులో నిందితులను 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు ఈ నెల 6వ తేదీన  చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు.

సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో  నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు.అంతేకాదు తమపై కాల్పులకు పాల్పడితే తాము వారిపై కాల్పులకు దిగడంతో నిందితులు మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు. 

దిశ నిందితుల మృతదేహాలు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాయి. ఈ మృతదేహాలు కుళ్లిపోయేస్థితిలో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మృతదేహాలు కుళ్లిపోకుండా రసాయనిక ఇంజక్షన్లు ఇస్తున్నారు.

సుప్రీంకోర్టు తదుపరి తీర్పు వచ్చే వరకు మృతదేహాలను భద్రపర్చేందుకు హైద్రాబాద్ కంటే న్యూఢిల్లీలోనే సరైన సౌకర్యాలు ఉన్నాయనే అభిప్రాయాలను వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీకి మృతదేహాలను తరలించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

click me!