ఆ రెండు ఘటనలు.. రగిలిపోయిన సైఫ్, రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీలు, హేళన : రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

By Siva Kodati  |  First Published Mar 1, 2023, 3:53 PM IST

డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసుకు సంబంధించి నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెండు ఘటనల కారణంగా సైఫ్‌ ప్రీతిపై విద్వేషం పెంచుకున్నాడని తెలుస్తోంది. 
 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ వైద్య విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే సీనియర్ పీజీ విద్యార్ధి సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనతి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. అతని సెల్‌ఫోన్‌లో 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనూష, భార్గవి, LDD+Knockouts గ్రూప్ చాట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగం ప్రీతికి సూపర్‌వైజర్‌గా సైఫ్ వ్యవహరిస్తున్నాడు. రెండు ఘటనల కారణంగా ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 

ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. దీనికి సంబంధించి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాసింది ప్రీతి. అయితే వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి రాసిన రిపోర్టును హేళన చేశాడు సైఫ్. రిజర్వేషన్‌లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ అవమానించాడు సైఫ్. అయితే తనతో ఏమైనా ప్రాబ్లమ్ వుంటే హెచ్‌వోడీకి చెప్పాలని సైఫ్‌కు ప్రీతి వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రీతిని వేధించాలని భార్గవ్‌కు చెప్పాడు సైఫ్. అంతేకాకుండా ఆర్‌ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు. ఈ వేధింపుల నేపథ్యంలో ఫిబ్రవరి 21న హెచ్‌వోడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్లు మురళీ, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి, సైఫ్‌లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. 

Latest Videos

ALso REad: డాక్టర్ ప్రీతి ఆత్మహత్య.. దోషులను వదిలేది లేదు, ఆ కుటుంబానికి అండగా వుంటాం : ఎమ్మెల్సీ కవిత

ఇకపోతే.. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరంలో చేరిన ప్రీతి.. సీనియర్ విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈనెల 22న ఉదయం ఓ మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని మొదట కథనాలు వెలువడ్డాయి. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ఆమెని ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు.

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి  విషమిస్తుండడంతో..  అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు.  అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందం విశ్వప్రయత్నాలు చేసింది. ఇంజక్షన్ ప్రభావం వల్ల ఆమె శరీరం లోపలి అవయవాలు అన్ని దెబ్బతిన్నాయని.. దీనివల్ల చికిత్సకు శరీరం ఏమాత్రం స్పందించలేకపోతుందని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. 
 

click me!