సైదాబాద్ అత్యాచార ఘటన.. స్నేహితుడి సహకారం, ఇంకా దొరకని నిందితుడు..!

Published : Sep 14, 2021, 08:14 AM ISTUpdated : Sep 14, 2021, 08:34 AM IST
సైదాబాద్ అత్యాచార ఘటన.. స్నేహితుడి సహకారం, ఇంకా దొరకని నిందితుడు..!

సారాంశం

. తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నారిపై కన్నేసిన రాజు.. నాలుగు రోజుల క్రితం చాక్లెట్ ఆశ చూపించి.. బాలికను తీసుకువెళ్లాడు. పాశవికంగా చిన్నారిని హత్య చేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు.

ఆరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అనంతరం బాలికను హత్య చేశాడు. నగరంలోని సైదాబాద్ లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. కాగా.. ఈ దారుణానికి పాల్పడింది.. రాజు అనే వ్యక్తి అని ఇప్పటికే నిందితులు గుర్తించారు. బాలిక శవం కూడా అతని ఇంట్లోనే లభించింది. అయితే.. నిందితుడు తప్పించుకోవడానికి అతని స్నేహితుడు సహకరించాడని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై పోలీసులను ప్రశ్నిస్తుండగా.. పోలీసులు మాత్రం రాజు ఆచూకీ ఇంకా లభించలేదని.. పది బృందాలతో గాలిస్తున్నామంటున్నారు.,

కాగా.. తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నారిపై కన్నేసిన రాజు.. నాలుగు రోజుల క్రితం చాక్లెట్ ఆశ చూపించి.. బాలికను తీసుకువెళ్లాడు. పాశవికంగా చిన్నారిని హత్య చేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్ని చోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకువెళ్లి.. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది. అక్కడున్నవారు వెంటనే గుర్తుపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్క్ చ టవల్, ఓ జత డ్రెస్ తో కూడిన బ్యాగ్ ఇచ్చాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

వీరి ఆరోపణలకు బలం చేకూరుస్తూ అక్కడున్న సీసీ కెమేరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు రాజు గంజాయి పీల్చడంతో పాటు గుడుంబా ఎక్కువగా తాగుతుంటాడని , ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడని పోలీసులు చెబుతున్నారు. అతని వద్ద ఫోన్ లేకపోవడంతో.. ఎక్కడున్నాడో తెలుసుకోవడం కష్టంగా మారిందన్నారు.

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu