తల్లిని చంపి డబ్బు , బంగారంతో పరార్ .. స్నేహితుడి అత్యాశ, చివరికి శవమై తేలిన దత్తపుత్రుడు

Siva Kodati |  
Published : May 12, 2022, 06:30 PM IST
తల్లిని చంపి డబ్బు , బంగారంతో పరార్ .. స్నేహితుడి అత్యాశ, చివరికి శవమై తేలిన దత్తపుత్రుడు

సారాంశం

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో తల్లిని  చంపి డబ్బు, బంగారంతో పారిపోయిన సాయి అనే వ్యక్తి చివరికి శ్రీశైలం అడవుల్లో శవమై తేలాడు. అతనిని స్నేహితుడు శివ హత్య చేసి అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. 

హైదరాబాద్ (hyderabad) సరూర్‌నగర్ (saroornagar) తల్లి హత్య కేసులో (mother murder) కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం దత్తపుత్రుడు (adopted son)  సాయి (sai) .. తల్లిని చంపేసి పారిపోయాడు. తల్లిని చంపి ఇంట్లోని డబ్బు, బంగారం ఎత్తుకుపోయాడు. స్నేహితుడు శివతో (shiva) కలిసి తల్లిని హత్య చేసి అనంతరం శ్రీశైలం అడవులకు (srisailam forest) పారిపోయాడు. ఈ క్రమంలో అమ్రాబాద్ అడవుల్లో సాయి, శివలు మద్యం సేవించారు. ఆపై సాయిని చంపి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లాడు శివ. అనంతరం సాయి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి కాలువలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సాయి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో శివ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

Also Read:మచిలీపట్నలో దారుణం... కన్న తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిచంపిన కసాయి కొడుకు

కాగా.. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీటీకాలనీలో నివాసం ఉండే భూదేవి (58) అనే మహిళ తనకు పిల్లలు కలగకపోవడంతో.. కొన్ని సంవత్సరాల క్రితం సాయితేజ అనే బాలుడిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది. అయితే ఆ దత్తపుత్రుడు మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ప్రతిరోజు డబ్బులు ఇవ్వమంటూ తల్లిని వేధించేవాడు. తల్లి అందుకు నిరాకరించేది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బంగారం, నగదుపై కన్నేసిన సాయితేజ.. తల్లి భూదేవి హత్యకు కుట్ర పన్నాడు. దీనిలో భాగంగా తన స్నేహితుడు శివతో కలిసి ఆమెను హత్య చేసి ఇంట్లో ఉన్న 30 తులాల నగలు, నగదు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చేసరికి భూదేవి రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. 
 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్