సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ రెడీ...దున్న పోతులతో యాదవులు కూడా...

By Arun Kumar PFirst Published Nov 8, 2018, 7:24 PM IST
Highlights

హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలకు సర్వం సిద్దమైంది. విభిన్న సంస్కృతుల నిలయమైన భాగ్యనగరంలో అనాధిగా వస్తున్న ఈ పండగను నగరవాసులు ఘనంగా  నిర్వహిస్తుంటారు.  ముఖ్యంగా నగరంలో అధిక సంఖ్యలో నివసిస్తున్న యాదవ కులస్థులు తమ వృత్తిలో భాగమైన దున్నపోతులను అందంగా ముస్తాబుచేసి వాటితో
సాహస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అందువల్ల ఈ ఉత్సవాలను తిలకించేందుకు నగర వాసులు కూడా ఆసక్తిని కనబరుస్తుంటారు. 

ఈ సదర్ ఉత్సవాల కోసమే దున్నపోతులను ప్రత్యేక వస్తువులు, పేయింట్స్ తో ముస్తాబు చేస్తారు. అంతేకాకుండా  యువకులు, పెద్దలని తేడా లేకుండా ప్రతిఒక్కరు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన డిజే ముందు నృత్యాలు చేస్తుంటారు. 

ఇక ఈ ఉత్సవాల్లో కొన్ని దున్నపోతులు ప్రత్యేక ఆకర్షనగా నిలుస్తాయి. ముఖ్యంగా 12 సార్లు జాతీయ చాంపియన్ గా నిలిచిన రాజా, 1600 కిలోల బరువుగల షంశీర్ తో పాటు ధార అనే మరో దున్నపోతు ఈ ఉత్సవాలకే ప్రత్యేకం.    

100 ఏళ్ల చరిత్ర గల ఈ ఉత్సవాలు తమ పూర్వీకల నుండి వారసత్వంగా తమకు లభించినట్లు హైదరాబాద్ లోని యాదవులు చెబుతారు. నగరవాసులను మరింత ఆకట్టుకోడానికి ఇతర ప్రాంతాల నుండి ప్రత్యేకతలు కలిగిన దున్నపోతులను తీసుకురావడం ప్రారంభించినట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.గతంలో అంతర్జాతీయ చాంఫియన్ యువరాజ్ ను ఈ ఉత్సవాలకోసం తీసుకువచ్చినట్లు  తెలిపిన ఆయన ఈసారి దాని కొడుకు ధార ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. 
 
click me!