ఎల్.రమణ టికెట్లు అమ్ముకున్నారు.. కార్తీక్ రెడ్డి ఫైర్

Published : Nov 15, 2018, 03:50 PM IST
ఎల్.రమణ టికెట్లు అమ్ముకున్నారు.. కార్తీక్ రెడ్డి ఫైర్

సారాంశం

కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేంద్ర నగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మహాకూటమిలో భాగంగా రాజేంద్రనగర్ టికెట్ టీడీపీకి దక్కింది.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి.. టీడీపీ, కాంగ్రెలపై మండిపడుతున్నారు. కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేంద్ర నగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మహాకూటమిలో భాగంగా రాజేంద్రనగర్ టికెట్ టీడీపీకి దక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి రాజీనామా చేసిన కార్తీక్.. టీడీపీ నేత ఎల్. రమణపై పలు విమర్శలు చేశారు.

మహాకూటమి పేరుతో ఎల్. రమణ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తనకు కావాలనే టికెట్ దక్కకుండా చేశారని ఆరోపించారు. కాగా.. 2014 ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.ప్రస్తుతం ఆయన రాజేంద్ర నగర్‌ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.దీంతో  రాజేంద్రనగర్ నుండి గణేష్‌గుప్తాను టీడీపీ తన అభ్యర్ధిగా బరిలోకి దింపింది.

అంతేకాకుండా ఒక కుటుంబం నుంచి ఒక సీటు మాత్రమే అనే నిబంధనను పాటిస్తున్నట్లు కాంగ్రెస్ ఇటీవలే ప్రకటించింది. ఈ నియమాన్ని కాస్త సడలించి కొందరికి మాత్రం ఒకే కుటుంబం నుంచి రెండు సీట్లు కేటాయించింది. ఈ కోవలోనే తనకు కూడా టికెట్ లభిస్తుందని కార్తీక్ భావించారు కానీ.. ఫలితం దక్కలేదు.

అయితే.. తన తల్లి సబితా ఇంద్రారెడ్డి.. తన భీఫాంని కొడుకోసం త్యాగం చేస్తే.. కార్తీక్ పోటీ చేసే అవకాశం దక్కుతుంది. లేదంటే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. 

read more news

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?