ఆర్టీసీ సమ్మె: మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

By telugu teamFirst Published Oct 13, 2019, 4:36 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె పరిణామాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో మనస్థాపం చెంది మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్  జిల్లా నర్సంపేట డిపో వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. 

నర్సంపేట: ఆర్టీసీ సమ్మె పరిణామాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో మనస్థాపం చెంది మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్  జిల్లా నర్సంపేట డిపో వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. 

రవి అనే ఆర్టీసీ కార్మికుడు ప్రభుత్వ తీరుకు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. నిప్పంటించుకునేటప్పుడు దీన్ని పసిగట్టిన తోటి కార్మికులు, పోలీసులు అతడిని అడ్డుకొని కాపాడారు. 

తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తున్నా విషయం తెలిసిందే. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు 48వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించింది. 

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా రాపర్తి నగర్ కు చెందిన డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాదాపు 90శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతు మరణించాడు.    

click me!