పోలీసు బందోబస్తుతో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహం ఖమ్మంకు తరలింపు

By narsimha lodeFirst Published Oct 13, 2019, 3:57 PM IST
Highlights

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టాన్ని త్వరగానే పూర్తి చేశారు. 

హైదరాబాద్: హైద్రాబాద్‌ డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య పోలీసులు  ఖమ్మంకు ఆదివారం నాడు మధ్యాహ్నం తరలించారు. 

శనివారం నాడు మధ్యాహ్నం ఆర్టీసీ డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైద్రాబాద్ లోని ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు మృతి చెందాడు.

శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి పోలీసులు త్వరితగతిన పోస్టుమార్టం పూర్తి చేయించారు. పోస్టుమార్టం పూర్తి చేసిన వెంటనే మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో ఖమ్మం తరలించారు.

శ్రీనివాస్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన విషయం వెంటనే ఆర్టీసీ కార్మికులు ఆపోలో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపంగా సోమవారం నాడు ఉదయం 10 గంటలకు అన్నిడిపోల వద్ద సంతాప సభలను నిర్వహించాలని  ఆర్టీసీ జేఎసీ పిలుపునిచ్చింది. ఇవాళ రాత్రి అన్నిడిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించాలని జేఎసీ పిలుపునిచ్చింది.

click me!