RTC Strike: పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

By telugu teamFirst Published Nov 13, 2019, 7:03 AM IST
Highlights

మరో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ గాలిలో కలిశాయి. మహబూబాబాద్ డిపోకు చెందిన నరేష్ అనే డ్రైవర్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరిలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

మహబూబాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో ఆర్టీసీ డ్రైవర్ బలవన్మరణం పొందాడు. మహబూబాబాద్ కు చెందిన నరేష్ అనే డ్రైవర్ బుధవారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు సేవించి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. గత 36 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. నరేష్ 2007లో ఆర్టీసీలో ఉద్యోగిగా చేరాడు. ఆర్టీసీ సమ్మెలో చురుగ్గా పాల్గొన్న నరేష్ చివరికి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నరేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ: హైకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న అశ్వత్థామరెడ్డి.

హైదరాబాదులోని రాణిగంజ్ లో మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ బాబా ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. డబీర్ పురాలో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

ఇదిలావుంటేస ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు టీఎస్ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా వేసిన అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం భేషజాలకు పోకుండా కోర్టు సూచన మేరకు కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు.

Also Read: సుప్రీం రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

విచారణ సందర్భంగా ముగ్గురు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని హైకోర్టు సూచించిందని.. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి అభిప్రాయం వెల్లడిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. తాము కూడా ముఖ్యమంత్రిని అదే కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం మాకు అంగీకారమేనని.. కమిటీకి కూడా కాలపరిమితి ఉంటుందని భావిస్తున్నట్లుగా అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పడానికి వీల్లేదని కోర్టు తెలిపినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. . 

click me!