
సూర్యాపేట: Hyderabad నుండి Jangaonదిశగా వైపు వెళ్తున్న RTC Bus ప్రమాదం సోమవారం నాడు తృటిలో బయటపడింది.అదుపు తప్పిన ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన చోటుచేసుకుంది..
ఒక్కసారిగా బస్సు అదుపుతప్పడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ చాక చక్యంగా బస్సును సైడ్ కాల్వలోకి తప్పించాడు.ఈ సంఘటన Alair జనగామ సరిహద్దుల్లో సోమవారం నాడు సాయంత్రం జరిగింది.
ఈ సంఘటన తో ఉలిక్కిపడిన ప్రయాణికులు హాహాకారాలు చెయ్యడంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల Jagadish Reddy తన కాన్వాయ్ ని నిలిపి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మాట్లాడారు.
అంతే గాకుండా మంత్రి జగదీష్ రెడ్డి సూచనతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులందరికి మంత్రి వ్యక్తిగత సిబ్బంది మంచి నీళ్ళు అందించారు. ప్రయాణీకులకు ధైర్యం చెప్పారు. యాదాద్రి నుండి ఆలేరు మీదుగా సూర్యాపేట కు ప్రయాణిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా దిగి రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అంతటి వెగంలోనూ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు.