భూపాలపల్లి ఎన్టీపీసీలో పేలుడు: ఏడుగురు కార్మికులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Published : Apr 25, 2022, 09:22 PM ISTUpdated : Apr 25, 2022, 10:00 PM IST
భూపాలపల్లి ఎన్టీపీసీలో పేలుడు: ఏడుగురు కార్మికులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

సారాంశం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘణపురం మండలం చేల్పూరులో గల ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో  సోమవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. 

భూపాలపల్లి: Jayashankar Bhupalpally  జిల్లాలోని NTPC  పవర్ ప్లాంట్ లో సోమవారం నాడు  Blast చోటు చేసుకొంది. ఈ ఘటనలో  ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ుందని అధికారులు తెలిపారు. 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ లో ఈ  పేలుడు చోటు చేసుకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘణపురం మండలం చేల్పూరు లో గట ఎన్టీపీసీలో పేలుడు  చోటు చేసుకొంది.

కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ లోని ఒకటో యూనిట్ లో మిల్లర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్టుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండ రోజుల పాటు పర్యటిస్తున్నారు.  ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు.పవర్ ప్లాంట్ అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్షించారు.  ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ సమీక్ష నిర్వహించారు. సాయంత్రానికి ఈ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకొంది. 

 

2006 జూన్ 6న కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. 2010  మే నుండి ఈ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ 2016 జనవరి లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu