నా సభలకు పవర్ కట్ చేస్తావా.. నేనొచ్చాకా నీ ఫామ్‌హౌస్‌కు కరెంట్ చేస్తా: కేసీఆర్‌కు ఆర్‌ఎస్ ప్రవీణ్ వార్నింగ్

By Siva KodatiFirst Published Aug 26, 2021, 6:39 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ ఐపీఎస్, బీఎస్పీ  నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన  సభలకు కరెంట్ కట్ చేస్తున్నారని.. తాను అధికారంలోకి వస్తే సీఎం ఫామ్ హౌస్‌కు కరెంట్ కట్ చేస్తానంటూ ఆయన హెచ్చరించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే గానీ దళితులపై ప్రేమ పుట్టుకురాలేదని.. మంత్రి హోదాలో వున్న ఓ వ్యక్తి తొడగొట్టి మాట్లాడతారా అని ప్రవీణ్ ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డిని వెంటనే పదవి  నుంచి  తప్పించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. బీజేప, టీఆర్ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పేర్కొన్నారు. బూతులు మాట్లాడేవాళ్లకు వర్సిటీలు ఇస్తున్నారని ప్రవీణ్ మండిపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు బుద్ధి చెప్పేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హుజూరాబాద్‌ డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. ఈ డ్రామాలో బీజేపీ కూడా అద్భుతంగా నటిస్తోందని ప్రవీణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.  
 

click me!