
ఎక్కడైనా ఆస్తుల కోసం, భూముల కోసం సాధారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే జగిత్యాలలో మాత్రం అస్థికల కోసం రెండు కుటుంబాలు గొడవకు దిగిన విచిత్ర సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత బుధవారం సాయంత్రం జగిత్యాల పట్టణానికి చెందిన పోచమ్మ అనే వృద్ధురాలికి చింత కుంట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాలు అయిపోయాక పోచమ్మ కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి భీమయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని రాత్రి 11 గంటల ప్రాంతంలో... పోచమ్మకు దహన సంస్కారాలు చేసిన అంత్యక్రియలు చేసి వెళ్లిపోయారు. అయితే ఆ మరుసటి రోజే.. అస్తికల కోసం పోచమ్మ కుటుంబసభ్యులు మరియు భీమయ్య కుటుంబ సభ్యులు ఆస్తికలు మావీ అంటే మావి అని గొడవ చేస్తున్నారు