నా మద్ధతు ఎప్పుడూ వాటికే.. అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

By AN TeluguFirst Published Jul 26, 2021, 12:30 PM IST
Highlights

నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుంది. హుజురాబాద్ లో వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలి. ఇప్పటికే వీఆర్ఎస్ తీసుకుని ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నాను. నన్ను వివాదాల జోలికి లాగొద్దని కోరుతున్నా. వివాదాల జోలికి లాగితే అంచనాలు తలకిందులవుతాయి’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. 

హుజూరాబాద్ లో నేతలకు మద్దతిస్తున్నట్లు తనమీద దుష్ప్రచారం జరుగుతోందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తాను మద్దతిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. 

నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుంది. హుజురాబాద్ లో వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలి. ఇప్పటికే వీఆర్ఎస్ తీసుకుని ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నాను. నన్ను వివాదాల జోలికి లాగొద్దని కోరుతున్నా. వివాదాల జోలికి లాగితే అంచనాలు తలకిందులవుతాయి’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు. 

కాగా, తాను  చావుకైనా సిద్ధమేనని.. ఎవరికీ భయపడనని మాజీ ఐపీఎస్ అధికారి  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికర సాధన కోసం మరణించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. పదవీ విరమణ చేసిన  మరుసటి రోజే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు.

Breaking: కొత్త పార్టీపై సంచలన ప్రకటన చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తాను అంబేడ్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఒక్క ప్రవీణ్ కుమార్ పై కేసులు పెడితే కోట్లాది మంది ప్రవీణ్ కుమారులు పుట్టుకువస్తారని ఆయన పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నానని.. తన తల్లి ప్రశ్నిస్తే.. కోట్లాది మంది దళిత బిడ్డలను బాగు చేసేందుకు తాను రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు.

వందల సంవత్సరాలుగా దళితులు అణచివేతకు గురవుతున్నారని, వారిపై కుట్రలు, కుతంత్రాలు జ రుగుతున్నాయని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మటన్, చికెన్‌ దావత్, బీరు, బిర్యానీలు, తాయిలాలకు మో సపోయే జాతులు మనవి కావని, రాజ్యాధికారం సాధించుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మన రాజ్యం వస్తుందని అలంపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు, తాండూర్‌ నుంచి నల్లగొండ వరకు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 

click me!