హైదరాబాద్ లో దారుణం... ఇంట్లోకి చొరబడి మరీ మైనర్ బాలికపై అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : Jul 26, 2021, 12:19 PM IST
హైదరాబాద్ లో దారుణం... ఇంట్లోకి చొరబడి మరీ మైనర్ బాలికపై అత్యాచారం

సారాంశం

ఇంట్లోకి చొరబడి మరీ మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

హైదరాబాద్: ప్రేమ పేరుతో వేధించడమే కాదు ఇంట్లోకి చొరబడి మరీ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. రాత్రంతా బాలిక ఇంట్లోనే వుండి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనోవేధనకు గురయిన బాలిక చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారణం తెలంగాణ రాజదాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... సైదాబాద్ సాయిరాం కాలనీలో భార్యాభర్తలు ఇద్దరు ఆడపిల్లలతో కలిసి నివాసముంటున్నారు. మైనర్ అయిన వీరి పెద్దకూతురిని (16సంవత్సరాలు) అదే కాలనీకి చెందిన పవన్ కల్యాణ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 5వ తేదీన బంధువుల ఇంట్లో శుభకార్యం వుండటంతో తల్లిదండ్రులు ఏలూరుకు వెళ్లారు. దీంతో అక్కాచెల్లెలు మాత్రమే ఇంట్లో వున్నారు. 

బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేరని తెలుసుకున్న పవన్ రాత్రి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇద్దరు బాలికలను బెదిరించి పెద్దమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రంతా అదే ఇంట్లో వుండి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి తెల్లవారుజాముల బయటకు వెళ్లిపోయాడు. 

read more  కన్న కొడుకు, కూతురిపైనే అఘాయిత్యం.. ఓ తండ్రి దుర్మార్గం.. !

తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు చెప్పకుండా తనలో తానే మధనపడింది బాలిక. ఈ క్రమంలోనే ఇటీదల మనస్తాపంతో ఇంట్లో వున్న శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే వెంటనే తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తమ కూతురు ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ అత్యాచారం విషయం బయటపడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. 

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై కేసు నమోదు చేశారు సైదాబాద్ పోలీసులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?