నిరుపేదలకు అండా దండ... కేసీఆర్ నిలువెత్తు చిత్రపటానికి పాలాభిషేకం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 26, 2021, 11:32 AM IST
నిరుపేదలకు అండా దండ... కేసీఆర్ నిలువెత్తు చిత్రపటానికి పాలాభిషేకం (వీడియో)

సారాంశం

నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడంటూ తాజాగా రేషన్ కార్డులు పొందిన లబ్దిధారులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 

కరీంనగర్: నిరుపేదల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలో నూతన రేషన్ కార్డులు పొందిన లబ్దిదారులు కేసీఆర్ నిలువెత్తు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
 
తాజాగా రేషన్ కార్డులు అందించడమే కాదు ఇప్పటికే అమలుచేస్తున్న అసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ వంటి అద్భుతమైన కార్యక్రమాల నిరుపేదల సంక్షేమానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. వీటి అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని లబ్దిదారులు గుర్తు చేసుకున్నారు.

వీడియో

ఈ కార్యక్రమంలో చొప్పదండిలో ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మహేశుని మల్లేశం, కృష్ణ, జహిరుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu