ఆ త్యాగాలపై మరొకరు సుఖపడుతున్నారు : కేసీఆర్ మీద ప్రవీణ్ కుమార్ పరోక్ష వ్యాఖ్య

Published : Jul 28, 2021, 09:53 AM IST
ఆ త్యాగాలపై మరొకరు సుఖపడుతున్నారు : కేసీఆర్ మీద ప్రవీణ్ కుమార్ పరోక్ష వ్యాఖ్య

సారాంశం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించడానికే బయటకు వచ్చానని, తెలంగాణా అమరుల త్యాగం మీద ఇంకొకరు సుఖ పడుతున్నారంటూ కేసీఆర్ మీద పరోక్షంగా చురకలు వేశారు. 

సూర్యాపేట జిల్లా : సూర్యాపేట లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళన, సమావేశంలో రిటైర్డ్ ఐ పి యస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించడానికే బయటకు వచ్చానని, తెలంగాణా అమరుల త్యాగం మీద ఇంకొకరు సుఖ పడుతున్నారంటూ కేసీఆర్ మీద పరోక్షంగా చురకలు వేశారు. 

నేను చేసిన త్యాగానికి అర్ధం ఉండాలంటే బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి అని పిలుపునిచ్చారు.ఎవరినీ అడుక్కోవలసిన అవసరం లేకుండా మన రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాం అన్నారు.

బహుజన అధికార నిధి కోసం అందరూ తమ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఆస్తులతో ప్రజలను వంచిస్తున్నారు, ఓట్లను కొని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

చారిత్రాత్మక నల్లగొండ జిల్లాలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. 
త్యాగాల పునాదుల మీదనే బహుజన రాజ్యం ఏర్పడుతుందని అన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !