తెలంగాణ: కొత్తగా 645 మందికి పాజిటివ్... 6,42,436కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Jul 27, 2021, 09:48 PM ISTUpdated : Jul 27, 2021, 09:50 PM IST
తెలంగాణ: కొత్తగా 645 మందికి పాజిటివ్...  6,42,436కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

తెలంగాణలో కొత్తగా 645 కరోనా కేసులు నమోదవ్వగా.. నలుగురు మృతి చెందారు. 729 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 9,237 యాక్టివ్‌ కేసులు వున్నాయి. 

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,23,166 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 645 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,42,436కు చేరింది. 24 గంటల వ్యవధిలో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు తెలంగాణలో మృతి చెందిన వారి సంఖ్య 3,791కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 729 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో తెలంగాణలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,29,408కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,237 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 24, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 32, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 2, కామారెడ్డి 3, కరీంనగర్ 58, ఖమ్మం 72, మహబూబ్‌నగర్ 7, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 15, మంచిర్యాల 20, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 31, ములుగు 4, నాగర్ కర్నూల్ 5, నల్గగొండ 42, నారాయణపేట 0, నిర్మల్ 3, నిజామాబాద్ 7, పెద్దపల్లి 47, సిరిసిల్ల 23, రంగారెడ్డి 27, సిద్దిపేట 17, సంగారెడ్డి 5, సూర్యాపేట 27, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 52, యాదాద్రి భువనగిరిలో 16 చొప్పున కేసులు నమోదయ్యాయి.  


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !