ముందస్తు ఎన్నికలు: నాంపల్లి స్టేషన్‌లో 65 లక్షల పట్టివేత..డబ్బు తరలింపు మొదలైందా..?

By sivanagaprasad KodatiFirst Published Sep 6, 2018, 12:00 PM IST
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలన్ని వ్యూహా ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఇక ఏ ఎన్నికల్లోనైనా అత్యంత ప్రభావం చూపే డబ్బు తరలింపు ప్రక్రియ కూడా మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలన్ని వ్యూహా ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఇక ఏ ఎన్నికల్లోనైనా అత్యంత ప్రభావం చూపే డబ్బు తరలింపు ప్రక్రియ కూడా మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి. నాంపల్లి రైల్వేస్టేషన్‌ రైలు భోగీలో భారీ మొత్తంలో నగదు దొరికింది.

రైల్వే పోలీసులు సోదాలు నిర్వహించి రూ.65 లక్షలను గుర్తించారు. వీటిలో ఎక్కువగా రెండు వందలు, రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికీ అనుమానం కలగకుండా.. నగదును కంటైనర్‌లో వేసి.. చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువుల డబ్బాల్లో ప్యాకింగ్ చేసి తరలిస్తున్నారు. కరెన్సీ కట్టలపై ఉన్న లేబుల్స్ ఆధారంగా నగదు ఏ బ్యాంక్ నుంచి డ్రా చేసింది..? ఎక్కడికి తరలిస్తున్నారు అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

click me!