నేడే తొలి విడత జాబితా: మధ్యాహ్నం రెండున్నరకు కేసీఆర్ ప్రెస్ మీట్

Published : Sep 06, 2018, 10:57 AM ISTUpdated : Sep 09, 2018, 01:30 PM IST
నేడే తొలి విడత జాబితా: మధ్యాహ్నం రెండున్నరకు కేసీఆర్ ప్రెస్ మీట్

సారాంశం

సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నట్టు  ప్రకటించారు.ఈ మేరకు అధికారికంగా సమాచారం వచ్చింది


హైదరాబాద్: సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నట్టు  ప్రకటించారు.ఈ మేరకు అధికారికంగా సమాచారం వచ్చింది.ఈ మీడియా సమావేశంలోనే అభ్యర్థుల జాబితాను కూడ ప్రకటించే అవకాశం లేకపోలేదనే సమాచారం కూడ ఉంది.

అయితే కేబినెట్ సమావేశం ముగించుకొని గవర్నర్ కలిసిన తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ కు చేరుకొంటారు. అక్కడ  ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయమై కేసీఆర్ మీడియాకు వివరించనున్నారు. 

మరో వైపు  ఇవాళ సుమారు 50 మంది అభ్యర్థుల  పేర్లను కూడ  కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.లేదా తొలి విడత జాబితా పేరుతో కొందరు అభ్యర్ధుల పేర్లను కూడ ప్రకటించే అవకాశం ఉంది. 

2014 ఎన్నికల సమయంలో  కేసీఆర్  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్  సీటు నుండి  జీవన్ రెడ్డి పేరును ప్రకటించారు.  ఈ దఫా  జీవన్ రెడ్డి పేరుతోనే అభ్యర్థుల జాబితాను  విడుదల చేస్తారా.. లేక మరోకరి పేరుతో జాబితా ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది,. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌