కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో దాడిచేసి.. రూ.27 లక్షల బంగారు నగలు చోరీ..

By SumaBala BukkaFirst Published Dec 7, 2022, 12:28 PM IST
Highlights

కొరియర్ చేయడానికి వెడుతున్న ఓ వ్యక్తి కళ్లలో కారం కొట్టి, గాయపరిచి రూ.27లక్షల విలువైన నగలను దోచుకెళ్లారు దుండగులు. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో భారీ దోపిడీ జరిగింది. రూ.27.12 లక్షల విలువచేసే  విలువ చేసే బంగారు ఆభరణాలను కొట్టేశారు. ఓ యువకుడి కళ్లల్లో కారం కొట్టి, అతనిమీద కత్తితో దాడి చేశారు. అతడి చేతిలో ఉన్న నగలను దోచుకెళ్లారు. బంగారం, డైమండ్స్ తో చేసిన ఆ నగలను యువకుడు కొరియర్లో పంపించేందుకు తీసుకెళ్తున్నాడు. ఈ ఘటన సోమవారం రాత్రి హైదరాబాదులోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి. సతీష్ కుమార్ సైనీ అనే వ్యక్తి వెస్ట్ మారేడ్ పల్లి కి చెందిన వాడు. ఇతనికి పాట్ మార్కెట్ లో జైమాతా లాజిస్టిక్స్ పేరుతో కొరియర్ సర్వీస్ ఉంది.  

తన కొరియర్ సర్వీస్ ద్వారా బంగారు నగలను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటాడు. పవన్ కుమార్ అనే వ్యక్తి సతీష్ కుమార్ సైనీ దగ్గర కొరియర్ బాయ్ గా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పవన్కుమార్ జిల్లాలోని శ్రీ జై అంబే కొరియర్స్ నుంచి రూ.8.65 లక్షలు విలువ చేసే బంగారు బిస్కెట్లను తీసుకొచ్చాడు.  ఆతరువాత హయత్ నగర్ లోని శ్రీ రాదే డైమండ్స్ కి వెళ్లి రూ.18,47,472 గ్రాముల నెక్లెస్ లో తీసుకున్నాడు. ఇవి రెండింటినీ తీసుకుని తన బైక్ మీద పాట్ మార్కెట్ కు వస్తున్నాడు. 

వైఎస్ షర్మిల మాటకు అర్థమేమిటి?.. ప్రధాని మోదీ ఆమెకు నిజంగానే ఫోన్ చేశారా..!

ఈ రెండు నగలను తమ కొరియర్ ద్వారా ముంబైకి పంపించాల్సి ఉంది. ఆర్పి రోడ్ లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు రాత్రి 9 గంటల 45 నిమిషాలకు పవన్కుమార్ చేరుకున్నాడు. అక్కడికి రాగానే  బైక్ మీద వేగంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతని కళ్లల్లో కారం కొట్టారు. పవన్ కుమార్ హెల్మెట్ పెట్టుకోవడంతో కారం అతని కళ్ళల్లోకి వెళ్ళలేదు. నగల కోసం తన మీద దాడి జరిగిందని గమనించిన పవన్ కుమార్ అప్రమత్తమై.. స్పీడ్ గా ముందుకు వెళ్ళాడు. అదే సమయంలో సిటీ లైట్ చౌరస్తాలో సిగ్నల్ పడింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

దుండగులు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో స్పీడ్గా వెళ్తున్న పవన్ కుమార్ బండి హెచ్ పి పెట్రోల్ బంకు సమీపంలో ఆటోను ఢీ కొట్టింది. దీంతో బండితో సహా కిందపడిపోయాడు. అప్పటికీ పవన్ కుమార్ ని వెంబడిస్తున్న దుండగులు.. పవన్ కుమార్ పడిపోవడం చూసి పరిగెత్తుకొచ్చి బ్యాగులు లాక్కునేందుకు ప్రయత్నించారు. అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో కత్తితో పవన్ ఎడమ చేతిపై పొడిచి.. బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. అక్కడ ట్రాఫిక్ ఉండటం.. వాహనాల మధ్య క్షణాల్లో కనిపించకుండా మాయమైపోయారు. 

వెంటనే తేరుకున్న పవన్ కుమార్ యజమానికి సమాచారం అందించాడు. దీంతో అతను మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ అపోలో కు తరలించారు. బాధితుడు తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. 

ప్రస్తుతం పవన్ కుమార్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నాడు. యజమాని సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు
కేసు నమోదు చేసుకున్నారు. దొంగల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.  అయితే ఇటీవల నాగోల్ లో ఆ బంగారం షాపు యజమాని పై కాల్పులకు తెగబడింది దోపిడికి ప్రయత్నించిన బ్యాంకు దీనికి సంబంధం లేదని పోలీసులు అంటున్నారు. 

click me!