ఖమ్మంలో రెచ్చిపోయిన రౌడీషీటర్లు.. కుటుంబంపై దాడి.. రహస్యంగా ఉంచిన పోలీసులు..

Published : May 05, 2022, 12:24 PM IST
ఖమ్మంలో రెచ్చిపోయిన రౌడీషీటర్లు.. కుటుంబంపై దాడి.. రహస్యంగా ఉంచిన పోలీసులు..

సారాంశం

ఖమ్మంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించిన పోలీసులపైకి కూడా దాడికి యత్నించారు.

ఖమ్మంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించిన పోలీసులపైకి కూడా దాడికి యత్నించారు. పోలీసు వాహనంతో రాళ్లతో విరుచుపడ్డారు. అయితే ఈ దాడి వ్యవహారాన్ని పోలీసులు రహస్యంగా ఉంచారు. వివరాలు..  58వ డివిజన్‌ పరిధిలోని రమణగుట్ట ప్రాంతంలో ఓ చిన్న వివాదానికి సంబంధించి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. 

బైకు ఢీకొట్టిన ఘటనపై ప్రశ్నించినందుకు ఆ కుటుంబం దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి యత్నించారు. అయితే అల్లరిమూకలు కత్తులు, కర్రలతో వీరంగం సృష్టించారు. వారిని అడ్డుకోవాలని చూసిన పోలీసులపైనే దాడికి యత్నించారు.

ఇక, ఇదిలా ఉంటే ఇటీవల ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో విద్యుత్ శాఖ ఏఈ విజయ్ కుమార్‌పై గ్రామస్తులు దాడి చేశారు. విద్యుత్ లైన్ రిపేర్ చేస్తుండగా హెల్పర్ వీరన్న మృతిచెందాడు.విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే హెల్పర్ మృతిచెందాడని ఆరోపిస్తూ గ్రామస్తులు ఈ దాడికి పాల్పడ్డారు. అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కారేపల్లి సబ్ స్టేషన్ ఎదుట వీరన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఏఈ విజయ్ కుమార్‌పై గ్రామస్థులు దాడి చేశారు. గ్రామస్థుల దాడిలో విజయ్ కుమార్ షర్ట్ చినిగిపోయింది.   

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ