దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి...ఆ రోటీమేకరే కారణమా?

By Arun Kumar PFirst Published Nov 11, 2020, 10:59 AM IST
Highlights

దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీలయిన టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలోకి దిగగా స్వల్ప ఓట్ల తేడాతో బిజెపి విజయ డంకా మోగించింది. 

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి మింగుడుపడని ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ బిజెపి అభ్యర్థి రఘునందర్ రావు అద్బుత విజయాన్ని అందుకున్నాడు. వెయ్యి పైచిలుకు ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి సోలిపేట సుజాతపై ఆయన పైచేయి సాధించారు. అయితే ఇలా స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ఓడిపోడానికి రోటీ మేకర్ కారణమంటూ ఆ పార్టీ నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. 

దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీలయిన టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు మొత్తం 23మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇలా సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన నాగరాజు అనే వ్యక్తి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అయితే ఇతడికి ఈసీ రోటీ మేకర్ గుర్తును కేటాయించింది. ఇదే తమ కొంప ముంచిందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా వుండటంతో ఒక్కో బూతులో రెండు ఈవిఎంలను ఉపయోగించింది ఈసీ. అయితే మొదటి ఈవిఎంలో టీఆర్ఎస్ గుర్తు కారు మూడో స్థానంలో వుండగా రెండో ఈవిఎంలో రోటీ రోటీ మేకర్ వుంది. దీంతో దాన్ని కారు గుర్తుగా భావించి కొందరు ఓటేసినట్లు... అందువల్లే ఆ గుర్తు కలిగిన ముక్కూ మొహం తెలియని అభ్యర్థికి ఏకంగా 3,570 పైచిలుకు ఓట్లు వచ్చాయిన అధికార పార్టీకి చెందిన నాయకులు అంటున్నారు. 

click me!