హైదరాబాద్ పోలీసులనే దోచేసిన ఘరానా దొంగలు

First Published Aug 6, 2018, 1:38 PM IST
Highlights

రాత్రి వేళల్లో దొంగలు, అసాంఘిక శక్తుల నుండి ప్రజలను కాపాడటానికి పోలీసులు ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే అలా పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులనే కొందరు ఘరానా దొంగలు దోచేశారు. పోలీసుల కారులోనుండే ఓ విలువైన ట్యాబ్ ను ఎత్తుకెళ్లారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ లో ఆదివారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏదో గొడవ జరుగుతున్న సమాచారం రావడంతో పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి వెళ్లారు.  అక్కడ గొడవపడుతున్న వారిని సముదాయించి, ఈ గొడవ కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇందుకోసం పోలీసులు కాస్సేపు తమ వాహనాన్ని దూరంగా పార్క్ చేశారు.

దీన్ని అదునుగా భావించిన కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ వాహనంలోని సామ్ సంగ్ ట్యాబ్లెట్ ను దొంగిలించారు. వాహనంలోకి చేరుకున్న సిబ్బందికి ట్యాబ్  కనిపించకపోయేసరికి జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!