సామాన్యుల ఇళ్లలో దొంగతనం చేస్తే కిక్కెముంటుందని అనుకున్నాడో ఏమో ఏకంగా జిల్లా కలెక్టర్ నివాసంలోని చోరికి పాల్పడ్డాడో ఘరానా దొంగ. కరీంనగర్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో దొంగలు పడ్డారు.
కరీంనగర్ : అది జిల్లా కలెక్టర్ నివాసం. జిల్లా పాలనాధికారికి నివాసం వుంటున్నాడంటే సెక్యూరిటీ మామూలుగా వుంటుందా... నిత్యం పోలీస్ పహారా వుంటుంది. ఇలా 24 గంటలు హైసెక్యూరిటీ వుండే కలెక్టర్ నివాసంలోనే చోరీకి పాల్పడ్డాడో ఘరానా దొంగ. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన గోపి ఇటీవలే బదిలీ అయ్యారు. అయితే ఆయన ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలోనే వుంటున్నారు. ఇలా కలెక్టర్ నివాసముంటున్న భవంతిలోనే దొంగలుపడ్డారు. కలెక్టర్ ఇంట్లో పడుకుని వుండగానే ఈ దొంగతనం జరిగింది.
undefined
కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వెనకవైపు గోడదూకి ఇంట్లోకి చొరబడ్డాడు దుండగుడు. సెక్యూరిటీ కంటపడకుండా ఇంట్లోకి చేరుకున్న దొంగ కలెక్టర్ ల్యాప్ టాప్ తో పాటు కొన్ని సర్టిపికెట్లతో కూడిన బ్యాగును దొంగిలించాడు. అలాగే మరికొన్ని వస్తువులను దొంగిలించి పరారయ్యాడు. ఈ దొంగతనం సమయంలో కలెక్టర్ గోపి తన బెడ్ రూంలో నిద్రిస్తున్నారు.
వీడియో
తన ల్యాప్ టాప్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కలెక్టర్ సిసి కెమెరాలను పరిశీలించారు. దీంతో దొంగతనం జరిగినట్లు బయటపడింది. దీంతో వెంటనే పోలీసులు సిసి కెమెరా ఆధారంగా దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏకంగా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లోనే దొంగతనం జరగడం ఇప్పుడు కరీంనగర్ లో హాట్ టాపిక్ గా మారింది.