పట్టపగలే రెచ్చిపోయిన మహిళా దొంగలు... కత్తులతో బెదిరించి చోరీ

By Arun Kumar PFirst Published 21, Sep 2018, 8:20 PM IST
Highlights

నిజామాబాద్ జిల్లాలో పట్టపగలే నలుగురు మహిళా దొంగలు రెచ్చిపోయారు. బిచ్కుంద మండలకేంద్రంలోని ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడ్డాడు. ఇలా మహిళా దొంగలు...అదీ పట్టపగలే దొంగతనానికి పాల్పడటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ ఘటన గురించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...బిచ్కుంద గ్రామానికి చెందిన మంగలి సంగ్రాం ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో సంగ్రాం కూతురు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నలుగురు గుర్తు తెలియని మహిళలు ఇంట్లోకి చొరబడ్డారు. బాలికను కత్తులతో బెదిరించి అరవకుండా అడ్డుకున్నారు. వీరు బాలిక గొంతుపై
కత్తి పెట్టి బెదిరించి బీరువా తాళాలు ఎక్కడుంటాయో తెలుసుకున్నారు. ఇలా బీరువాలోని 70 వేల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను కూడా దోచుకున్నట్లు బాదితులు తెలిపారు.

చోరీ విషయాన్ని బాలిక తండ్రికి తెలపడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళా దొంగల కోసం గాలింపు చేపట్టారు.  

Last Updated 21, Sep 2018, 8:20 PM IST