గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published : Sep 21, 2018, 07:27 PM ISTUpdated : Sep 21, 2018, 08:07 PM IST
గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో కూర్చుని డబ్బులకు పదవులు అమ్ముకునే వారా నాకు షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో కూర్చుని డబ్బులకు పదవులు అమ్ముకునే వారా నాకు షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడే వాళ్లు, పోస్టులు అమ్ముకునేవాళ్లు, టిక్కెట్లు అమ్ముకునే వాళ్లా నాకు షోకాజ్ నోటీసులు ఇస్తారా అంటూ మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే వాళ్లకు తెలుసా అని ప్రశ్నించారు. కార్యకర్తలు అంటే ఎవరో తెలియని వాళ్లా నాకు షోకాజ్ నోటీసులు ఇస్తారా అని వార్నింగ్ ఇచ్చారు.  

రాజకీయాల్లో నన్ను రెచ్చగొట్టేందుకు కొందరు నాపై కుట్రపన్నారని మండిపడ్డారు. అందులో భాగమే షోకాజ్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. తనలాంటి క్రమశిక్షణ కలిగిన నాయకులను కోల్పోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. తనకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం ఉందన్నారు. ముఖ్యమంత్రి కావాలని, మంత్రులు కావాలని తనకు ఎలాంటి ఆశలేదని కానీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమన్నారు. 

మరోవైపు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు వ్యతిరేకంగా జిల్లాలో పావులు కదుపుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ ను ప్రోత్సహించారని తెలిపారు. నాలుగేళ్లలో 100 సార్లు తనను అవమానించినా పార్టీ కోసం, పార్టీకోసం శ్రమించిన కార్యకర్తల కోసం పార్టీలో కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్ 

వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

తెలంగాణకు కుంతియా శనిలా దాపురించాడు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu