బస్వాపూర్ గ్రామీణ బ్యాంకు చోరీ:మూసాపేటలో మంకీ క్యాప్‌లు కొనుగోలు చేసిన దొంగలు

By narsimha lode  |  First Published Jul 6, 2022, 3:10 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బస్వాపూర్ కు చెంందిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు చోరీ కేసులో దొంగలను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగలు మంకీ క్యాప్ కొనుగోలు చేసిన దుకాణంలో సీసీటీవీ పుజేటీ పరిశీలించారు.


నిజామాబాద్: ఉమ్మడి Nizambad  జిల్లాలోని Baswapur లో Telangana Grammena Bank చోరీ కేసులో నిందితుల కోసం పోలీసుల సీసీటీవీ పుటేజీని సేకరించారు. దొంగలు వదిలివెళ్లిన మంకీ క్యాప్ తో పాటు కవర్  ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 2వ తేదీన దొంగల ముఠా ఎనిమిదిన్నర కిలోల gold  దోచుకు వెళ్లింది. Gas  కట్టర్ సహాయంతో దొంగలు Locker ను తెరిచే ప్రయత్నం చేశారు. అయితే గ్యాస్ అయిపోవడంతో  దొంగలు తమ ప్రయత్నాలను వదిలివెళ్లారు. అయితే గ్యాస్ కట్టర్ ను ఉపయోగించే సమయంలో మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో దొంగలు తమ వెంట తెచ్చుకొన్న Monkey Cap ఒక్కటి అక్కడే వదిలి వెళ్లారు. మంకీ క్యాప్ తో పాటు కవర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైద్రాబాద్ మూసాపేటలోని ఓ దుకాణంలో దొంగలు ఈ మంకీ క్యాప్ లను కొనుగోలు చేశారని పోలీసులు గుర్తించారు.ఈ దుకాణంలో ఉన్న CCTV  పుటేజీ  ఆధారంగా  దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Latest Videos

బస్వాపూర్ గ్రామీణ బ్యాంకు జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది. ఈ బ్యాంక్ రోడ్డుకు పక్కనే ఉంటుంది. ఈ బ్యాంకులో చోరీకి సంబంధించి దొంగలు రెక్కీ నిర్వహించి దోపీడీకి పాల్పడ్డారు.
 

click me!