హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే దారిదోపిడి... గోల్డ్ షాప్ యజమానిని బురిడీ కొట్టించి లక్షల బ్యాగులతో పరార్

Arun Kumar P   | Asianet News
Published : Feb 18, 2022, 04:49 PM ISTUpdated : Feb 18, 2022, 04:57 PM IST
హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే దారిదోపిడి... గోల్డ్ షాప్ యజమానిని బురిడీ కొట్టించి లక్షల బ్యాగులతో పరార్

సారాంశం

హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడూ రద్దీగా వుండే పంజాగుట్ట ప్రాతంలో వాహనదారులంతా చూస్తుండగానే ఓ గోల్డ్ షాప్ యజమాని వద్దగల డబ్బుల సంచులను దోచుకుని పరారయ్యారు ఘరానా దొంగలు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) నడిబొడ్డున పట్టపగలే దోపిడీదొంగలు రెచ్చిపోయారు. నిత్యం రద్దీగావుండే పంజాగుట్ట (panjagutta) ప్రాంతంలో ఓ జువెల్లరీ షాప్ యజమానిని బురిడీ కొట్టించిన దొంగలు అతడివద్దగల డబ్బుల బ్యాగుతో ఉడాయించారు. అందరూ చూస్తుండగా దోపిడీసొత్తుతో రయ్ రయ్ మంటూ బైక్ పై దూసుకెళ్లారు దోపిడి దొంగలు. 

హైదరాబాద్ లో జువెల్లరీ షాప్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన పంజాగుట్టలో ఓ వ్యక్తి గోల్డ్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఇవాళ మద్యాహ్నమే షాప్ మూసేసిన అతడు  బైక్ పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో షాప్ లోని మూడులక్షలకు పైగా డబ్బును రెండు బ్యాగుల్లో పెట్టుకుని అతడు బయలుదేరడం దొంగలు గమనించినట్లున్నారు. దీంతో అతడిని బైక్ పై వెంబడించిన దొంగలు గ్రీన్ ల్యాండ్ దారిలో డబ్బులతో కూడిన రెండు బ్యాగులను దోచుకున్నారు. 

ఒక్కసారిగా తన చేతిలోచి డబ్బుల బ్యాగులను లాక్కుని అదేవేగంతో దొంగలు ముందుకు దూసుకెళ్లడంతో గోల్డ్ షాప్ యజమాని షాక్ కు గురయ్యాడు. అంతలోనే తేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దగ్గర్లోని పోలీసులు వెంటనే స్పందించి దొంగలను వెంబడించారు. 

పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో బైక్ వేగంగా పోనిస్తుండగా డబ్బులతో కూడిన ఓ బ్యాగ్ దొంగల వద్దనుండి రోడ్డుపై పడిపోయింది. అయితే పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా బైక్ ను గల్లీల్లోకి పోనిచ్చి దొంగలు మాయమయ్యారు.

అయితే దొంగల చేతిలోంచి జారిపడ్డ బ్యాగ్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అందులో రూ.1.5లక్షలు వున్నట్లు సమాచారం. మిగతా రెండులక్షలతో కూడిన బ్యాగ్ దొంగల వద్దే వుండిపోయింది. ఈ దోపిడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలు వెళ్లిన దారిలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ సిసి పుటేజి ఆదారంగా దొంగలు ఎవరన్నది గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.  గోల్డ్ షాప్ యజమానికి తెలిసివారు ఎవరైనా ఈ పని చేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలావుంటే మరో తెలుగురాష్ట్రం ఏపీలో కూడా దోపిడిదొంగలు రెచ్చిపోయారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ఇంట్లో దొంగలు పడ్డారు. ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో తాళం వేసి వున్న ఎమ్మెల్యే నివాసంపై దొంగల కన్ను పడింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీభత్సం సృష్టించారు. 

ఎమ్మెల్యే ఇంట్లోని అన్ని బీరువాలను బద్దలుగొట్టి వాటిలో ఉన్న విలువైన వస్తువులను దొగిలించారు. మిగతా వస్తువులు, దుస్తులను చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు. ఉదయం బాలవర్ధనరావు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలో ఉంచిన సుమారు లక్షా 50 వేల నగదు, కొంత  బంగారం పోయినట్లు తెలిపారు. వెంటనే ఇంట్లో జరిగిన దొంగతనంపై మాజీ ఎమ్మెల్యే ఉంగుటూరు పోలీసులకు సమాచారం అందించారు. 
 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...
CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu