భారీ వర్షాలతో వరంగల్- హన్మకొండ మధ్య కనెక్టివిటి తెగిపోయింది. భారీ వాహనాలు కూడ వరద నీటిలో కొట్టుకుపోయాయి.
వరంగల్: భారీ వర్షాలతో వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళ్లపై నుండి సహాయం చేయాలని ఆర్ధిస్తున్నారు. వరంగల్- హన్మకొండ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. వరంగల్ నగరంలో నయీం నగర్ వద్ద వరదలు ఇళ్లను ముంచెత్తాయి. భారీ వాహనాలు కూడ వరదలో కొట్టుకుపోయాయి.
అయితే నాలా వద్ద జేసీబీ సహాయంతో కొట్టుకుపోయిన వాహనాలను వరద నీటి నుండి బయటకు తీస్తున్నారు. వరద నీటిలో అంబులెన్స్ కూడ కొట్టుకుపోయింది. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డు, నయీం నగర్,శివనగర్ బస్తీల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఈ కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హంటర్ రోడ్డులో వరద భాదితులను రక్షించేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, పైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. హంటర్ రోడ్డులో వరదలో చిక్కుకున్న స్థానికులను కాపాడేందుకు స్పీడ్ బోట్ సహాయంతో వెళ్లిన ఎస్ఐ సాంబయ్య కూడ వరద నీటిలో చిక్కుకున్నారు. ఎస్‌డీఆర్ఎఫ్, సిబ్బంది, పైర్ సిబ్బంది బోట్ల సహాయంతో స్పీడ్ బోటులో చిక్కుకున్న వారిని కాపాడారు.
వరంగల్ నగరానికి చుట్టూ నాలుగు చెరువులున్నాయి. వడ్డేపల్లి చెరువు పరివాహక ప్రాంతంలో నాలుగు గంటల వ్యవధిలో 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వరంగల్ నగరాన్ని ఈ వరద నీరు ముంచెత్తింది. వరంగల్ రైల్వే స్టేషన్ ను వరద నీరు ముంచెత్తింది.
also read:వరద ప్రభావిత ప్రాంతాల్లో 18 బోట్లతో రెస్క్యూ: ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి
వరంగల్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మరో వైపు నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో వరద ప్రభావిత వాసులను తరలించారు.