హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: మంటల్లో కాలిపోయిన డ్రైవర్

Published : Apr 15, 2021, 08:17 AM IST
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: మంటల్లో కాలిపోయిన డ్రైవర్

సారాంశం

హైదరాబాదు రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కంటైనర్ డ్రైవర్ సీట్లో ఇరుక్కుని మంటల్లో కాలిపోయాడు.

శంషాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదులోని అప్పా జంక్షన్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో భారీ కంటైనర్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కంటైనర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 

మంటల్లో సూరజ్ అనే డ్రైవర్ కాలిపోయాడు, మూర్తునుజన్ అనే క్లీనర్ కూడా మరణించినట్లు ప్రచారం సాగుతోంది. ఏసి కంటెనర్ లో ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న భారీ కంటైనర్ ఓ లారీని ఢీకొట్టింది. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని చెబుతున్నారు.

రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చెసే లోపే రెండు ప్రాంణాలతో పాటు కంటైనర్ అగ్నికి అహుతి అయింది.

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం