వరిపొలంలో ఆటో బోల్తా, 18 మంది కూలీలకు తీవ్రగాయాలు

Siva Kodati |  
Published : Feb 03, 2021, 04:14 PM IST
వరిపొలంలో ఆటో బోల్తా, 18 మంది కూలీలకు తీవ్రగాయాలు

సారాంశం

రాజన్నసిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి.

సిరిసిల్లలోని సుభాష్‌ నగర్‌కు చెందిన కూలీలు దుమాల గ్రామంలో పత్తి తీసేందుకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటో ఎల్లారెడ్డిపేట మండలం వరిపొలంలో బోల్తాపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కూలీలు ప్రయాణిస్తున్న ఆటోకు ఎదురుగా రేకుల లోడ్‌తో ట్రాలీ వెళ్తోంది. ఈ క్రమంలో అందులో ఓ రేకు పైకి ఎగిరి ప్యాసింజర్‌ ఆటో వైపు దూసుకురావడంతో డ్రైవర్‌ దానిని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణ తేలింది.

కాగా, ప్రమాదానికి కారణమైన ట్రాలీ ఆటో డ్రైవర్‌ పరారీలో ఉండగా, ప్యాసింజర్‌ ఆటో డ్రైవర్‌ బుర్ర శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu