Latest Videos

బాలుడిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. చిన్నారి మృతి...

By SumaBala BukkaFirst Published May 9, 2023, 8:19 AM IST
Highlights

నిజామాబాద్ శివారులో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం బాలుడిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాల పాలైన బాలుడు దీపక్ తేజ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడు బోధన్ కు చెందిన దీపక్ తేజ్ గా గుర్తించారు. గుర్తుతెలియని వాహనం ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని.. కొత్త వాహనంగా తెలుస్తోంది.

అయితే, ఈ వాహనం ఎమ్మెల్యే షకీల్ ది గా చెబుతున్నారు చూసినవారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే షకీల్ భార్య కారులో ఉందని చూసినవారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!