హైదరాబాద్ లోని నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆగిఉన్న టిప్పర్ ను కారు వేగంగా వచ్చి గుద్దడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ : హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న టిప్పర్ను ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు నార్సింగి సమీపంలో శుక్రవారం వెలుగు చూసింది. ఓ కారు శంకర్ పల్లి నుంచి నార్సింగి వస్తుండగా.. అక్కడ ఆపి ఉన్న టిప్పర్ను చూసుకోకుండా గుద్దడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులంతా నిజాంపేట వాసులుగా గుర్తించారు. చేతగాత్రులను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు.
కారులో అక్కాచెల్లెళ్లు.. అర్షిత, అంకితతో పాటు వారి స్నేహితులు నితిన్, అమృత్ మరికొందరున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే అక్కాచెల్లెళ్లు.. అర్షిత, అంకిత.. నితిన్ మృతి చెందారు. అమృత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.
ఇదిలా ఉండగా, కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ 70 ఏళ్ల వృద్ధుడు చొక్కా జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు అంటుకున్నాయి. వెంటనే అతను ఫోన్ ను జేబులో నుంచి కిందికి విసిరేసి.. మంటలను ఆర్పేశాడు. దీనికి పక్కనే ఉన్న వ్యక్తి సాయం చేశాడు. దీంతో అతను తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇలియాస్ అనే వ్యక్తి మరోట్టిచల్ ప్రాంతంలోని ఓ టీ దుకాణంలో కుర్చీలో కూర్చొని టీ తాగుతున్నాడు. ఆ సమయంలో ఆయన షర్ట్ జేబులో ఉన్న ఫోన్ ఉన్నట్టుంది పేలి, మంటలు చెలరేగాయి. వెంటనే అతను జేబును దులిపి ఫోన్ కింద పడేశాడు. అప్పటికే చొక్కాకు మంటలు అంటుకోగా.. వాటిని చేతితో దులిపి ఆర్పేశాడు.
మంటలు తక్కువగా ఉండడం, కాటన్ దుస్తులు కావడంతో వెంటనే ఆరిపోయాయి. అక్కడ టీ షాపులో ఉన్న వ్యక్తి వెంటనే గమనించి.. ఇలియాస్ కు సాయపడ్డాడు. మొబైల్ నుంచి మరిన్ని మంటలు చెలరేగకుండా నీళ్లు పోసి ఆర్పేశాడు.
మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలడం రాష్ట్రంలో ఒక నెలలో ఇలాంటి మూడో సంఘటన ఇది. ఈ సంఘటన విజువల్స్ వైరల్ అయ్యాయి. స్థానికి టీవీల్లో బ్రేకింగ్ వేశారు.
మంటలు గమనించిన వృద్ధుడు వెంటనే పైకి లేచి, అతని టీ గ్లాసు మీద పడవేసి, పిచ్చిగా తన జేబులో నుండి ఫోన్ తీయడానికి ప్రయత్నించాడు. అతని జేబులో నుండి నేలపై పడిపోయింది. అతని వెర్రి ప్రయత్నాలే అతనిని రక్షించాయి. అతనికి గాయాలవ్వకుండా బయటపడ్డాడు.
జిల్లాలో ఈ సంఘటన జరిగిన ఒల్లూరు పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారి మాట్లాడుతూ, అతను క్షేమంగా ఉన్నాడని తెలిపారు. సంఘటనకు సంబంధించి సమాచారం అందడంతో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వృద్ధుడిని పిలిచినట్లు అధికారి తెలిపారు. ఏడాది క్రితం రూ.1000కు మొబైల్ కొనుగోలు చేశానని, అది ఫీచర్ ఫోన్ అని సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఇప్పటి వరకు ఫోన్ తో ఎలాంటి సమస్యలు లేవని సదరు వ్యక్తి పోలీసులకు తెలిపినట్లు అధికారి తెలిపారు.