హైదరాబాద్ : సీబీఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్ధులు దుర్మరణం, మరో ఏడుగురి పరిస్ధితి విషమం

Siva Kodati |  
Published : May 19, 2023, 02:55 PM IST
హైదరాబాద్ : సీబీఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్ధులు దుర్మరణం, మరో ఏడుగురి పరిస్ధితి విషమం

సారాంశం

హైదరాబాద్ సీబీఐటీ కాలేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలవ్వగా.. మరో ఏడుగురి పరిస్ధితి విషమంగా వుంది. 

హైదరాబాద్ సీబీఐటీ కాలేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్ధులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఏడుగురు విద్యార్ధుల పరిస్ధితి విషమంగా వున్నట్లు సమాచారం. చనిపోయిన వారంతా మైనర్లే కావడం దురదృష్టకరం. మృతులను అంకిత, అర్షిత, అమృత, నితిన్‌లుగా గుర్తించారు. వీరంతా బ్యాచిలర్ పార్టీ కోసం నిజాంపేట్ నుంచి ఓషియన్ పార్క్‌కి బయల్దేరారు. అయితే ఒకే వాహనంలో 12 మంది ఎక్కినట్లుగా తెలుస్తోంది. 

వీరు ప్రయాణిస్తున్న కారు నార్సింగ్ సీబీఐటీ కాలేజీ వద్దకు రాగానే లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా మరో లారీని ఢీకొట్టింది. డ్రవైర్ అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్న వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?