మిర్యాల గూడలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

Published : Aug 24, 2021, 08:23 AM IST
మిర్యాల గూడలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

సారాంశం

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

నల్గొండ : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో 15మందికి గాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జున్ (40), నాగేశ్వర్ రావు (44), గుంటూరు జిల్లాకు చెందిన జయరావ్ (42)గా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!