
మితిమీరిన వేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని బోయిన్‌పల్లి తాడ్ బండ్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ చదువుతున్న అనిరుద్, విశ్వ అక్కడికక్కడే మృతిచెందగా, అఖిల్ కు తీవ్ర గాయాలయ్యాయి.
బాలానగర్ వైపు వెళ్లే ముస్లిం గ్రావేయార్డ్ మలుపు సమీపంలో వీరు వెళుతున్న బైక్ డివైడర్ ను ఢీ కొట్టడంతో బైక్ మీద ఉన్న ముగ్గురు రోడ్డుకు ఆవలివైపు పడిపోయారు. అదే సమయంలో వేగంగా వస్తోన్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో ఘోరం జరిగింది. అనురుద్, విశ్వ అక్కడిక్కడే మృతిచెందారు.
అఖిల్‌కు తీవ్ర గాయాలవగా స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.