గచ్చిబౌలిలో జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి (వీడియో)

Published : Sep 10, 2018, 08:33 AM ISTUpdated : Sep 19, 2018, 09:17 AM IST
గచ్చిబౌలిలో జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి (వీడియో)

సారాంశం

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది... చౌరస్తా సమీపంలోని బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న వారిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది... చౌరస్తా సమీపంలోని బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న వారిపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. బస్సు కోఠి నుంచి లింగంపల్లి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని.. మృతదేహలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

"

 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్